జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మోట్లపల్లి గ్రామ శివారులో కూలీల ఆటో బోల్తా పడింది. అడ్డుగా వచ్చిన పామును తప్పించబోయిన ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. ప్రమాదంలో ఐదుగురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ప్రైవేట్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న మొగుళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.
పాము అడ్డం వచ్చి ఆటో బోల్తా.. ఐదుగురికి తీవ్ర గాయాలు - పాము అడ్డం వచ్చి ఆటో బోల్తా.. 5గురికి తీవ్ర గాయాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. మొగుళ్లపల్లి మండలం మోట్లపల్లి గ్రామానికి మిర్చి ఏరడానికి వెళ్తోన్న కూలీల ఆటో బోల్తా పడింది. గ్రామ శివారులో రోడ్డుపై పాము ఆకస్మికంగా రావడం వల్ల ఆటో అదుపు తప్పి ఈ ఘటన చోటు చేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు...ఒకరి పరిస్థితి విషమం
Last Updated : Mar 16, 2020, 10:54 PM IST