జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పెగడపల్లి గ్రామంలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఓ ఇంట్లో వన్యప్రాణి మాంసం ఉందన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు తనిఖీ చేపట్టేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. అటవీశాఖ అధికారులను ఆ ఇంటి వ్యక్తులు అడ్డుకోవడమే కాక చితకబాదారు.
అటవీశాఖ సిబ్బందిపై దాడి.. ఒకరి తలకు తీవ్ర గాయం - అటవీశాఖ సిబ్బందిపై దాడి వార్తలు
భూపాలపల్లి జిల్లా పెగడపల్లిలోని ఓ ఇంట్లో వన్యప్రాణి మాంసం ఉందన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు తనిఖీ చేపట్టేందుకు ప్రయత్నించగా ఆ ఇంటి వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. వారిపై దాడి కూడా చేయగా.. బేస్ క్యాంప్ సభ్యుడు మహమ్మద్ ఇబ్రహీం తలకు తీవ్ర గాయలయ్యాయి.
అటవీశాఖ సిబ్బందిపై దాడి.. ఒకరి తలకు తీవ్ర గాయం
ఈ ఘటనలో బేస్ క్యాంప్ సభ్యుడు మహమ్మద్ ఇబ్రహీం తలపై గాయాలు కాగా తీవ్రంగా రక్తం పోయింది. మరో బేస్ క్యాంప్ సభ్యుడు బాలు, అతనితోపాటు రెడ్డిపల్లి బీట్ అధికారి కిరణ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ విషయమై మహాముత్తారం పోలీస్ స్టేషన్లో అటవీశాఖ అధికారులు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి:భూ పంచాయితీ విషయంలో తీర్మానానికి వెళ్లిన సర్పంచ్‌పై దాడి