తెలంగాణ

telangana

ETV Bharat / state

తెగిపోయిన అప్రోచ్​ రోడ్డు.. ఆ రాష్ట్రానికి రాకపోకలు బంద్​.. - approach road Broken at Kaleswaram bridge

approach road Broken: రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. ఫలితంగా ప్రాజెక్టులన్నీ పూర్తిస్థాయి నీటిమట్టాలకు చేరుకుని ఉగ్రరూపం దాలుస్తున్నాయి. కాళేశ్వరం వంతెన వద్ద వరద ఉద్ధృతికి అప్రోచ్ రోడ్డు తెగిపోయింది. దీంతో మహారాష్ట్రకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

తెగిపోయిన అప్రోచ్​ రోడ్డు.. ఆ రాష్ట్రానికి రాకపోకలు బంద్​..
తెగిపోయిన అప్రోచ్​ రోడ్డు.. ఆ రాష్ట్రానికి రాకపోకలు బంద్​..

By

Published : Jul 15, 2022, 3:31 PM IST

approach road Broken: తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాలతో జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్​ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతుంది. వరద ఉద్ధృతికి కాళేశ్వరం వంతెన వద్ద అప్రోచ్​ రోడ్డు తెగిపోయింది. ఫలితంగా రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన అధికారులు.. మరమ్మతు చర్యలు ప్రారంభించారు. ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో చర్యలకు ఆటంకం కలుగుతోంది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతుంది. 1986లో 28 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదవ్వగా.. ప్రస్తుతం 28 లక్షల 67వేల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ఫలితంగా మేడిగడ్డ పంప్​ హౌస్ వరద నీటిలో మునిగిపోయింది. భారీగా వరద నీరు చేరడంతో మేడిగడ్డ 85 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజీ ఇన్‌ఫ్లో 11,39,665 క్యూసెక్కులు కాగా.. ఉన్న 66 గేట్లను తెరిచి అంతే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details