జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి చిత్రపటాలకు... భూపాలపల్లి ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు పాలాభిషేకం చేశారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు నెలకు 25 కిలోల బియ్యం, రూ.2 వేల ఆర్థిక సాయం అందించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
కేసీఆర్, గండ్ర వెంకటరమణా రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం - ప్రైవేట్ టీచర్స్ వార్తలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి చిత్రపటానికి ప్రైవేటు ఉపాధ్యాయులు పాలాభిషేకం చేశారు. కరోనా కష్ట సమయంలో ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు.
Anointing private teachers to KCR photo in jayashanker Bhupalpally district
భూపాలపల్లి పట్టణాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెరాస జిల్లా నాయకులు బుర్ర రమేష్ గౌడ్, ప్రైవేట్ స్కూల్స్ జిల్లా అధ్యక్షులు నాగుల దేవేందర్ రెడ్డి ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.