ప్రతి కులాన్ని అభివృద్ధి పరిచే కార్యక్రమంలో భాగంగా .. సీఎం ముదిరాజ్ల సంక్షేమం కోసం ఐదు ఎకరాల భూమిని కేటాయించినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పేర్కొన్నారు.
సీఎం ప్రతిపాదనలు
ప్రతి కులాన్ని అభివృద్ధి పరిచే కార్యక్రమంలో భాగంగా .. సీఎం ముదిరాజ్ల సంక్షేమం కోసం ఐదు ఎకరాల భూమిని కేటాయించినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పేర్కొన్నారు.
సీఎం ప్రతిపాదనలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో .. ముదిరాజ్ సంఘ జిల్లా అధ్యక్షులు జోరుక సదయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి.. అన్ని కులాల సంక్షేమం కోసం సీఎం కృషి చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో ముదిరాజ్ కులాన్ని బీసీ-డీ నుంచి బీసీ-ఏ లోకి తీసుకువచ్చేందుకు సీఎం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ముదిరాజ్ కుల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తోన్న సీఎంకు ఆ సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.