Annaram Barrage Repaire Work Completed : రాష్ట్రవ్యాప్తంగా అన్నారం బ్యారేజీలో సీపేజీ ఏర్పడిన విషయం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమయంలో దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలాయి. దీనికి గత కేసీఆర్ సర్కారే బాధ్యత వహించాలని అప్పటి ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ డిమాండ్ చేశాయి. ఇక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బ్యారేజీ మరమ్మతులపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే అన్నారం బ్యారేజీలో (Annaram Barrage) ఏర్పడిన బుంగల మరమ్మతుల పనులను నిర్మాణ సంస్థ ఆప్కాన్స్ పూర్తి చేసింది.
Seepage at Two Places in Annaram Barrage : గతేడాది నవంబర్‌లో 38, 28 పియర్ల వద్ద సీపేజీ ఏర్పడిన విషయం తెలిసిందే. అప్పుడే అప్రమత్తమైన అధికారులు రాళ్లు, ఇసుక సంచులతో తాత్కాలిక మరమ్మతు చేసి లీకేజీని అదుపు చేశారు. బుంగల నుంచి ఇసుక బయటికి పోకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇటీవల అన్నారం బ్యారేజీని పరిశీలించిన మంత్రుల బృందం రెండు బుంగలతో ప్రమాదమేమి లేదని తేల్చారు. నిర్మాణ సంస్థతో గ్రౌటింగ్ చేయించాలని అధికారులను ఆదేశించారు.
మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై పర్యావరణ నిపుణుల హెచ్చరిక
Annaram Saraswati Barrage Leakage :ఇందులో భాగంగానే ఆప్కాన్స్ సంస్థ ప్రత్యేకంగా హిమాచల్‌ప్రదేశ్ నుంచి హెలికాప్టర్లో పాలియూరిథిన్ అనే కెమికల్ తెప్పించి, వంతెనలోని 38, 28 పియర్ల వద్ద బుంగలకు గ్రౌటింగ్ పనులను చేయించింది. రెండు పియర్స్ వద్ద ఏర్పడిన సీపేజీ మరమ్మతు పూర్తయినట్లు ఇంజినీరింగ్ వర్గాలు తెలిపాయి.