జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎంపీటీసీలు పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో తమకు నిధులు కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేశారు.
సీఎం చిత్రపటానికి ఎంపీటీసీల పాలాభిషేకం - anointing MPTCs CM kcr
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీటీసీలకు నిధులు కేటాయించడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ రేగొండలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎంపీటీసీలు పాలాభిషేకం చేశారు.
సీఎం చిత్రపటానికి ఎంపీటీసీల పాలాభిషేకం
ఎంపీటీసీలుగా గెలిచిన నాటి నుంచి ఇప్పటి వరకు ఉత్సవ విగ్రహాలుగా ఉన్నామని.. ప్రస్తుతం ఎంపీటీసీల పరిస్థితి అర్థం చేసుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు ఎర్రబెల్లి రవీందర్ రావు, ఎంపీటీసీ ఐలి శ్రీధర్, ప్రతాప్ రెడ్డి, వెంకన్న, పుణ్ణం రవి, మైస భిక్షపతి, బొట్ల సామ్రాట్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :మళ్లీ కరోనా కలవరం.. పెరుగుతోన్న రోజువారీ బాధితులు