జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతులందరికీ రైతుబంధు నగదు ఖాతాల్లో జమ అవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నగేష్ తెలిపారు. మీ ఖాతాల్లో రైతుబంధు నగదు పడిందో.. లేదో తెలుసుకోవాలంటే.. స్మార్ట్‌ఫోన్‌లో https://treasury.telangana.gov.in/index1.php?service=allschemes అనే లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు.
అందరికీ రైతుబంధు వస్తుంది : జిల్లా వ్యవసాయాధికారి నగేష్
జిల్లాలోని రైతులందరికీ రైతుబంధు నగదు ఖాతాల్లో పడుతుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యవసాయ అధికారి నగేష్ తెలిపారు. జాబితా ప్రకారం అందరి ఖాతాల్లో నగదు జమ అవుతుందని ఆయన రైతులకు సూచించారు.
రైతుబంధు నగదు జమ కాని రైతులు వ్యవసాయాధికారుల ఆఫీసుల చుట్టు తిరగవద్దన్నారు. కాస్త సంయమనం పాటించి..ఎదురు చూస్తే అందరి ఖాతాల్లో జమ అవుతుందని అన్నారు. కొతమందికి ముందే పడి.. మరికొంతమందికి ఆలస్యంగా పడొచ్చని.. అంత మాత్రాన మీ పేరు రైతుబంధు అర్హుల జాబితాలో లేదని అనుకోవద్దని ఆయన రైతులకు సూచించారు. ఒకవేళ ఆలస్యం అయితే.. సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని ఫోన్ ద్వారా సంప్రదించి.. పరిష్కారం పొందవచ్చని ఆయన అన్నారు. ఒకవేళ రైతులు వ్యవసాయ శాఖ ఆఫీసుకు వెళ్లాలనుకుంటే.. మాస్కులు ధరించి వెళ్లాలని, చేతులకు శానిటైజర్ రాసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులకు రైతులంతా సహకరించాలని వ్యవసాయ అధికారి నగేష్ కోరారు.
ఇవీ చూడండి:కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్