జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలోని కాకతీయుల కాలం నాటి కోటగుళ్ల గణపేశ్వరాలయం గర్భగుడిలోకి పాము ప్రవేశించింది. సుమారు పదడుగుల భారీ సర్పం శివలింగం వెనుక కలియతిరుగుతూ కనిపించింది. గర్భగుడిలోకి సర్పాని చూసిన పూజారి, భక్తులు భయాందోళనకు గురయ్యారు. రిక్షా కార్మికుడు రాజయ్య ఆ భారీ సర్పాన్ని పట్టుకుని ఆలయానికి దూరంగా పొదల్లో వదిలేశారు. ఈ పామును జెర్రిపోతు అంటారని ఆయన చెప్పారు.
గర్భగుడిలో పాము ప్రత్యక్షం.. తర్వాత ఏం జరిగిందంటే..? - snake in temple at Jayashankar Bhupalapally District
''ఎప్పుడు మీరే మీ బాధలు చెప్పుకోవడానికి గుడికి వెళ్తారా... నాకు బాధలున్నాయి.. నేను కూడా దేవుడికి నా మొర అలకించకుంటా'' అని అనుకుందేమో ఓ సర్పం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపేశ్వరాలయం గర్భగుడిలోకి వెళ్లింది.
'నాకు బాధలున్నాయి... నేనూ మొర అలకించుకుంటా'