జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో పీఎసీఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం ప్రారంభించారు. రైతులు పండించిన వరి పంటకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేస్తామన్నారు. ప్రతి గింజను ప్రభుత్వం తరపున ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ఎవరు కూడా దళారులకు అమ్ముకుని మోసపోవద్దని సూచించారు.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ అబ్దుల్ అజీం ప్రారంభించారు. ఎవరు దళారులకు అమ్ముకుని మోసపోవద్దని కోరారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద గుంపులుగా ఉండొద్దని సూచించారు.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్
ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ కురాకుల స్వర్ణలత, సివిల్ సప్లై మేనేజర్ రాఘవేందర్, జిల్లా వ్యవసాయ అధికారి సత్యంబాబు, జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు, తహసీల్దార్ రాణి, ఎస్ఐ నిహారిక, జడ్పీటీసీ జోరిక సదయ్య, గ్రామ సర్పంచ్ మోటే ధర్మారావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :కేసులు పెరుగుతున్నాయ్.. జర భద్రం