తెలంగాణ

telangana

ETV Bharat / state

నాటిన ప్రతి మొక్క సంరక్షణ ఎంతో కీలకం: ఎస్ఐ - 200 Saplings

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో ఆరో విడత హరితహారంలో భాగంగా పోలీసులు మొక్కలు నాటారు. అనంతరం రెండు వందల పండ్ల మొక్కలను పంపిణీ చేశారు.

రేగొండ పోలీసుల ఆధ్వర్యంలో హరితహారం
రేగొండ పోలీసుల ఆధ్వర్యంలో హరితహారం

By

Published : Jul 3, 2020, 5:34 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని రేగొండ పోలీస్ ఆధ్వర్యంలో ఆరో విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రభుత్వ పాఠశాల, వేణుగోపాల స్వామి ఆలయం ఆవరణలో మొక్కలు నాటి నీరుపోశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద సుమారు 200 పండ్ల మొక్కలు స్థానికులకు పంపిణీ చేశారు. మొక్కలు నాటిన వెంటనే బాధ్యత తిరిపోయిందని అనుకోకుండా.. ఆయా మొక్కల సంరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని రేగొండ ఎస్​ఐ కృష్ణ ప్రసాద్ గౌడ్ సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది నరేష్, రమేష్, యూత్ నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details