భూపాలపల్లి జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోందని జిల్లా వైద్య అధికారులు తెలిపారు. 45ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఇవాళ 5,843 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు వివరించారు.
భూపాలపల్లి జిల్లాలో ఒక్కరోజే 5,843 మందికి కొవిడ్ వ్యాక్సిన్ - తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ వార్తలు
రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం 5,843 మందికి కరోనా టీకా వేశారు.
అంబట్ పల్లి, ఆజంనగర్, భూపాలపల్లి, రేగొండ, ఘన్పూర్, చెల్పూర్, కాటారం, మొగుళ్లపల్లి, మహా ముత్తారం, ఒడితెల, తాడిచెర్ల, వెలిశాల సామాజిక ఆరోగ్య కేంద్రాలు... చిట్యాల, మహాదేవ్ పూర్, సింగరేణి ఏరియా ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతోందని వెల్లడించారు. ఇవాళ 3,152 మంది ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు, 2,649 మంది 60 ఏళ్లు పైబడిన వారికి టీకా వేశామని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని ప్రోగ్రాం అధికారిణి డా.మమతాదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.జె.సుధార్ సింగ్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను అధిగమిస్తాం: మంత్రి గంగుల