జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘణపురం మండలం కోటగుళ్ళులోని శ్రీ భవానీ సహిత గణపతేశ్వర దేవాలయాన్ని 40 మంది జర్మనీ దేశస్థులు సందర్శించారు. ఆలయ అందాలను వారి కెమెరాలలో బంధించారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను అందించారు.
ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యులు పర్యటకులకు ఆలయ చరిత్ర, కోటగుళ్ళు శిల్పకళా నైపుణ్యాన్ని వివరించారు. వారు ఎంతో ఉత్సాహంగా ఆలయాన్ని తిలకించారు. ఆలయం ఆవరణలో యోగాసనాలు వేస్తూ ఆనందంగా గడిపారు. కోటగుళ్ళు శిల్పాకళా సంపద అద్భుతం అని పర్యటకులు కొనియాడారు.