జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు ఈ నెల 26న ఛలో మల్లారం కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమాన్నికి పోలీసుశాఖ తరఫున ఎటువంటి అనుమతులు లేవని ఎస్సై తెలిపారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ఛలో మల్లారం కార్యక్రమాన్ని విరమించుకోవాలని సూచించారు. మండలంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.
ఛలో మల్లారం కార్యక్రమాన్నికి అనుమతి లేదు: ఎస్సై - 144 section Implemented at Mallaram
ఈ నెల 26న వివిధ పార్టీలు తలపెట్టిన ఛలో మల్లారం కార్యక్రమాన్ని విరమించుకోవాలని కొయ్యూరు ఎస్సై తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఛలో మల్లారం కార్యక్రమాన్నికి అనుమతి లేదు: ఎస్సై
నిబంధనల ప్రకారం ముగ్గురు కంటే ఎక్కువ వ్యక్తులు ఒకేచోట ఉండకూడదని వెల్లడించారు. ఎటువంటి అసత్యపు వార్తలు గానీ, అసత్యపు సమాచారం గానీ సోషల్ మీడియాలో ప్రచారం చేయరాదని తెలిపారు. ఈ విషయంలో ఏటువంటి అనుమానాలు ఉన్న కొయ్యూరు పోలీస్ స్టేషన్నందు సంప్రదించాలని సూచించారు.