జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేటలో పరుశరాంపల్లికి చెందిన 105 ఏళ్ల వృద్ధురాలు చింతిరెడ్డి ఆగమ్మ కరోనా టీకా తీసుకున్నారు. ఈ విషయాన్ని చెల్పూరు ఇంఛార్జ్ వైద్యాధికారిణి ఉమాదేవి ధ్రువీకరించారు.
కరోనా టీకా తీసుకున్న 105 ఏళ్ల వృద్ధురాలు - 105 years old women vaccinated in bhupalpally
కరోనా టీకాపై ప్రజల్లో అవగాహన పెరిగింది. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం పరుశరాంపల్లికి చెందిన 105 ఏళ్ల వృద్ధురాలు కరోనా టీకా తీసుకుంది.
కొవిడ్ వ్యాక్సిన్, కరోనా టీకా, వృద్ధురాలికి కరోనా టీకా, భూపాలపల్లి జిల్లా
అంతటి వృద్ధురాలే ధైర్యంగా టీకా తీసుకున్నారని, కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో ఎవరూ అపోహలకు గురికావొద్దని వైద్యాధికారిణి తెలిపారు. అర్హులైన ప్రతిఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.
- ఇదీ చదవండి :రాష్ట్రంలో మరో 3,840 కరోనా కేసులు, 9 మరణాలు