తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాళేశ్వరంలో ఆలయాల మూసివేత'

తెలంగాణలోని ప్రసిద్ధ ఆలయ ప్రధాన ద్వారాలను చంద్ర గ్రహణం సందర్భంగా అర్చకులు మూసివేశారు. గ్రహణం అనంతరం తిరిగి బుధవారం శుద్ధి పూజలు నిర్వహించి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.

చంద్ర గ్రహణం సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం మూసివేత

By

Published : Jul 16, 2019, 7:57 PM IST

చంద్ర గ్రహణం సందర్భంగా తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను అర్చకులు మూసివేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని శైవ దివ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి మూసేశారు. చంద్ర గ్రహణకాలం ప్రారంభమయ్యే ముందు స్వామి వారికి నిత్య కైంకర్యాలు, పూజలు నిర్వహించారు.
అనంతరం ప్రధాన తలుపులు మూసేసి బంధనం చేశారు. కాళేశ్వరంలోని అనుబంధ ఆలయాలు అన్నింటినీ మూసేశారు. బుధవారం ఉదయం 6.30 గంటలకు శుద్ధి, పుణ్యాహవచనం, సంప్రోక్షణ పూజలు చేసి స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.

చంద్ర గ్రహణం సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం మూసివేత

ABOUT THE AUTHOR

...view details