తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికారులమని నమ్మించి బాలుడిని ఎత్తుకెళ్లారు - 'ప్రభుత్వ ప్రతినిధులమని బాలున్ని ఎత్తుకెళ్లిపోయారు...'

ప్రభుత్వ ప్రతినిధులమని నమ్మబలికారు. డబుల్​ బెడ్​రూంలు ఇస్తామని ఆశజూపారు. పత్రాలు తెచ్చి ఇచ్చే లోపే... పదినెలల బాలున్ని ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని సింగంపల్లిలో చోటుచేసుకుంది.

10 MONTHS BOY KIDNAPPED IN SINGAMPALLY
10 MONTHS BOY KIDNAPPED IN SINGAMPALLY

By

Published : Mar 9, 2020, 10:41 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని సింగంపల్లిలో బాలుడి అపహరణ కలకలం రేపింది. కలగూరి మహేశ్​, పద్మ దంపతులకు పది నెలల కుమారుడున్నాడు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఇంటి ముందు చిన్నారి హరీశ్​ను నానామ్మ ఆడిస్తోంది.

అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై మహేశ్​ ఇంటికి చేరుకున్నారు. తాము ప్రభుత్వ ప్రతినిధులమని... రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేయిస్తామని నమ్మబలికారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పూర్తి వివరాలు ఇవ్వాలని అడిగారు. వాకిట్లో ఉన్న మంచంలో చిన్నారిని పడుకోబెట్టి ఇంట్లోకి వెళ్లింది. మళ్లీ బయటకు వచ్చి చూసేసరికి... ఇద్దరు వ్యక్తులతో పాటు బాలుడు కూడా లేడు.

కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మర విచారణ చేపట్టారు. బాలుడు హరీశ్​ని బైకుపై ఎత్తుకెళ్తున్న దృశ్యాలు బోర్లగూడెంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చుట్టుపక్కల ప్రాంతాల పోలీస్​స్టేషన్లకు కూడా సమాచారమిచ్చి దర్యాప్తు ముమ్మరం చేశారు.

'ప్రభుత్వ ప్రతినిధులమని బాలున్ని ఎత్తుకెళ్లిపోయారు...'

ఇదీ చూడండి:ఎస్​ బ్యాంక్​ వ్యవస్థాపకుడిపై 'మోసం, అవినీతి' కేసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details