జనగామ జిల్లా తొలి జడ్పీ ఛైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి - zp
జనగామ జిల్లాగా ఏర్పాడిన తర్వాత తొలి జడ్పీ ఛైర్మన్‌గా పాగాల సంపత్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
జడ్పీ ఛైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి
జనగామ జిల్లా తొలి జడ్పీ ఛైర్మన్‌గా చిల్పూర్ మండల జడ్పీటీసీగా విజయం సాధించిన పాగాల సంపత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్‌గా బచ్చనాపేట మండలం జడ్పీటీసీగా గెలుపొందిన గిరాబోయిన భాగ్యలక్ష్మి ఎన్నికయ్యారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి వీరికి నియామక పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తెరాస నాయకులు, కార్యకర్తలు టపాకాయలు పేల్చి సంబురాలు జరుపుకున్నారు.