తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏడాదిలోగా పట్వారీ వ్యవస్థను రద్దు చేస్తాం: మంత్రి ఎర్రబెల్లి - ఏడాదిలోగా పట్వారీ వ్యవస్థను రద్దు చేస్తాం: మంత్రి ఎర్రబెల్లి

వచ్చే ఏడాదిలోపు పట్వారీ వ్యవస్థను రద్దు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి పరిధిలో పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ప్రభుత్వం సూచించిన పంటలనే వేయాలి : మంత్రి ఎర్రబెల్లి
ప్రభుత్వం సూచించిన పంటలనే వేయాలి : మంత్రి ఎర్రబెల్లి

By

Published : Jun 6, 2020, 3:45 PM IST

Updated : Jun 6, 2020, 7:39 PM IST

జనగామ జిల్లా పాలకుర్తి మండలం మంచుప్పులలో పల్లె ప్రగతి, ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. వచ్చే సంవత్సరం లోగా పట్వారీ వ్యవస్థను రద్దు చేస్తామని వెల్లడించారు.

అనంతరం వారి బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు, వ్యవసాయ అధికారులకు అప్పగిస్తామన్నారు. రైతును రాజుగా చూడాలనేదే సీఎం కేసీఆర్ ధ్యేయమని మంత్రి అన్నారు. అన్నదాతలు.. ప్రభుత్వం సూచించిన పంటలనే వేయాలని సూచించారు.

ఏడాదిలోగా పట్వారీ వ్యవస్థను రద్దు చేస్తాం: మంత్రి ఎర్రబెల్లి

ఇవీ చూడండి : రాష్ట్రంలో ఒప్పంద సేద్యానికి చట్టరూపం దాల్చనుందా?

Last Updated : Jun 6, 2020, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details