జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ప్రతి చెరువును దేవాదుల నీటితో నింపే చర్యలు చేపట్టినట్లు స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. ప్రతి రైతు ఏడాదికి మూడు పంటలు పండించే విధంగా నీటిని సరఫరా చేస్తామన్నారు. ఆదివారం స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండ గ్రామ శివారులోని వల్లభరాయ చెరువు వద్ద పూజలు నిర్వహించారు.
స్టేషన్ ఘనపూర్లో ప్రతి ఎకరాకు సాగునీరు : రాజయ్య - Station Ghanpur MLA Rajaiah Latest news
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. ఆదివారం స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండ గ్రామ శివారులోని వల్లభరాయ చెరువు వద్ద పూజలు నిర్వహించారు.
రాజయ్య
తాటికొండ వద్ద గల మల్లన్న గండి జలాశయం నుంచి వల్లభరాయ చెరువుకు నీటిని తరలించే కాలువ పనులను పరిశీలించేందుకు 7 కిలోమీటర్ల మేర రాజయ్య పాదయాత్ర చేశారు. చిల్పూర్ మండలంలోని శ్రీపతిపల్లి, లింగంపల్లి, కొండాపూర్ గ్రామాలకు త్వరలోనే దేవాదుల నీరు అందేలా చర్యలు చేపట్టేందుకు అధికారుల చర్చిస్తానన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు ధాన్యాన్ని విక్రయించుకునే లబ్ధి పొందాలని సూచించారు.
ఇదీ చూడండి:'అమ్మా నీకు వందనం' అంటూ అద్భుత సైకత శిల్పం!