Warangal TRS Leaders meeting: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 20న జనగామ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. దీంతో పర్యటనను విజయవంతం చేసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా తెరాస నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సమీకృత కలెక్టర్ కార్యాలయంతోపాటు, జిల్లా తెరాస పార్టీ కార్యాలయం, సభా స్థలిని పరిశీలించారు. అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి సభ విజయవంతం చేయడానికి జిల్లా నేతలకు పలు సూచనలు చేశారు. సభకు వచ్చే వారికి తగిన ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. వాహనాలకు పార్కింగ్ సౌకర్యం పక్కాగా కల్పించాలని సూచించారు. సభ అలంకరణ వసతుల కల్పన అంశాలపై చర్చించి ఆయా నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎర్రబెల్లి సూచించారు.
Warangal TRS Leaders meeting: ఈనెల 20న కేసీఆర్ జనగామ టూర్... ఏర్పాట్లలో తెరాస నేతలు
Warangal TRS Leaders meeting: ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లా పర్యటనను విజయవంతం చేయడంపై ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు దృష్టి సారించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సమీకృత కలెక్టర్ కార్యాలయంతోపాటు, జిల్లా తెరాస పార్టీ కార్యాలయం, సభాస్థలిని పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా నేతలకు ఎర్రబెల్లి సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నామని మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. గతంలో కరవు కాటకాలతో ఉన్న జనగామ ప్రాంతంలో రెండు పంటలకు సాగునీరు అందించి రైతును రాజుగా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు ప్రజలందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారని సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మలోత్ కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, నన్నపనేని నరేందర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రైతు బంధు సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.