తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆధారాలతోనే డీసీసీ అధ్యక్షుడిని అరెస్టు చేశాం: సీపీ ప్రమోద్​కుమార్​ - telangana news

జనగాం డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అరెస్ట్​లో ఎలాంటి ఒత్తిళ్లు లేవని.. వరంగల్​ సీపీ ప్రమోద్​కుమార్​ స్పష్టం చేశారు. కుట్రపూరితంగానే అరెస్ట్​ చేశారన్న ప్రచారాన్ని తప్పుబట్టారు. కేవలం ఫిర్యాదు ఆధారంగానే చర్యలు తీసుకున్నామన్నారు.

warangal cp pramod kumar
ఆధారాలతోనే డీసీసీ అధ్యక్షుడిని అరెస్టు చేశాం: సీపీ ప్రమోద్​కుమార్​

By

Published : Jan 3, 2021, 7:21 AM IST

భూ వివాదంలో అపహరణకు పాల్పడినట్లు కచ్చితమైన ఆధారాలతోనే జంగా రాఘవరెడ్డిని అరెస్టు చేశామని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ పి. ప్రమోద్‌కుమార్‌ స్పష్టం చేశారు. జనగామ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాఘవరెడ్డిని కుట్రపూరితంగా పోలీసులు అరెస్టు చేశారని కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలు తప్పుడు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.

రాఘవరెడ్డి అరెస్టు వెనుక ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదు మీదనే కేసు నమోదు చేశామన్నారు. నిందితుడు రాఘవరెడ్డి ఫిర్యాదుదారుడిని బెదిరించి.. కొట్టి.. అతన్ని కిడ్నాప్‌ చేసి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడడం వల్లనే కేసు నమోదు చేశామన్నారు. నిందితుడు ఎలాంటి నేరానికి పాల్పడనప్పుడు నేరుగా పోలీసుల ముందుకు వచ్చి సంజాయిషీ ఇవ్వాల్సి ఉందన్నారు. కేసు నమోదైన తర్వాతనే రాఘవరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారన్నారు. రౌడీషీటర్‌ చరిత్ర ఉన్న వ్యక్తిని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సమర్ధిస్తూ మాట్లాడడం సరికాదన్నారు. కమిషనరేట్‌ పరిధిలో రాఘవరెడ్డిపై ఏడు కేసులు నమోదయ్యాయన్నారు.

ఇవీచూడండి:జనగామ కాంగ్రెస్​ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details