తెలంగాణ

telangana

ETV Bharat / state

చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం - పోచన్నపేట చెరువులో పడి ఇద్దరు మృతి

జనగామ జిల్లా పోచన్నపేటలో విషాదం చోటుచేసుకుంది. చెరువు వద్దకు సరదాగా వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ఆ చెరువులో మునిగి మృత్యువాత పడ్డారు. పిల్లల మరణంతో వారి కుటుంబాలు దుఃఖ సాగరంలో మునిగి పోయాయి. తల్లిదండ్రుల రోదనలు చూసి గ్రామస్థులూ కంట తడి పెట్టారు.

చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం
చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం

By

Published : Feb 9, 2020, 12:05 AM IST

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటలోని పెద్ద చెరువులో జక్కరయ్య, పాలయ్య అనే ఏడేళ్ల వయసున్న ఇద్దరు విద్యార్థులు మునిగి చనిపోయారు. మృతి చెందిన ఇద్దరు విద్యార్థులు ఇదే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నారు. రోజువారీగా బడికి వెళ్లకుండా తమ ఇళ్ల పక్కనే ఉన్నా చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మరణించారు. అది చూసి వారి తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

రెండిళ్లలో పెద్దోళ్లే..

పోచన్నపేటలోని బేడ బుడగ జంగాల కాలనీకి చెందిన నూనె ఎల్లమ్మ, మదార్ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇందులో పెద్దొడైన జక్కరయ్య మృతి చెందాడు. లక్ష్మి, సారయ్య దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా వీరిలో పెద్ద కుమారుడైన పాలయ్య మరణించాడు.

చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం

ఇవీ చూడండి:ఇళ్లు ఇప్పిస్తామని మోసం.. రూ.2 కోట్లకు పైగా వసూల్​

ABOUT THE AUTHOR

...view details