మహబూబాబాద్ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు ప్రభుత్వమే పరోక్ష కారణమంటూ జనగామ డిపో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. రంగప్రవేశం చేసిన పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. అక్రమ అరెస్టులను నిలిపివేసి, వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.అంతకుముందు కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు మారి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సర్వమత ప్రార్థనలు చేశారు.
కార్మికుల ఆందోళనలు.. పోలీసుల అరెస్టులు - జనగామ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన
జనగామ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్సు డిపో ఎదుట కార్మికులు ఆందోళనకి దిగారు. మహబూబాబాద్ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు ప్రభుత్వమే పరోక్ష కారణమని ఆరోపించారు.
కార్మికుల ఆందోళనలు.. పోలీసుల అరెస్టులు