ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించిన ఆర్టీసీ కార్మికులను, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇంటి ముట్టడిలో ఉద్రిక్తత - ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇంటి ముట్టిడికి యత్నం
ఆర్టీసీ కార్మికులు జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇంటి ముట్టిడికి యత్నించగా పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ కార్మికుడు స్పృహ తప్పి పడిపోయాడు.
ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇంటి ముట్టడిలో ఉద్రిక్తత
ఈ సందర్భంగా ఓ ఆర్టీసీ కార్మికుడు స్పృహ తప్పి పడిపోగా అతనిని పోలీస్ వాహనంలో జనగామ ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్న కొందరు కార్మికులు ఎమ్మెల్యే లేక పోవడం వల్ల అక్కడున్న తెరాస కార్యకర్తలకు వినతి పత్రం అందజేశారు.
ఇవీ చూడండి: మూడున్నర గంటలుగా ఎంఎంటీఎస్ క్యాబిన్లోనే లోకో పైలెట్