జనగామ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. డిపోలో 115 ఆర్టీసీ బస్సులు, 25 ప్రైవేట్ బస్సులు నిత్యం సేవలు అందిస్తుండగా సమ్మె ప్రభావంతో ఏకడిక్కడ నిలిచిపోయాయి. మొత్తం డిపోలో పనిచేస్తున్న 533 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. సుమారు 100 మంది ప్రైవేటు వ్యక్తులతో అధికారులు 24 బస్సులను నడిపిస్తున్నారు. డిపోల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తుండగా, జిల్లా కేంద్రంలోని ప్రిస్టోన్ కళాశాల మైదానంలో పోలీసుల పహారా నడుమ ఆర్టీసీ కార్మికులు మౌన దీక్ష చేపట్టారు. బస్సులు లేకపోవటంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. బస్సులు లేక పోవడంతో జనగామ బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది.
జనగామలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె - tsrtc bus strike today
తమ డిమాండ్ల పరిష్కరమే లక్ష్యంగా ఆర్టీసీ కార్మికులు జనగామ జిల్లాలో సమ్మెను కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరితమయ్యాయి. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
జనగామలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె