తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్మికుల 'సేవ్​ ఆర్టీసీ' నిరసన ర్యాలీ - tsrtc employes protest rally

జనగామలో ఆర్టీసీ కార్మికులు 'సేవ్​ ఆర్టీసీ' పేరుతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి ఉద్యోగులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కార్మికుల 'సేవ్​ ఆర్టీసీ' నిరసన ర్యాలీ

By

Published : Nov 23, 2019, 11:13 PM IST

ఆర్టీసీని రక్షించాలని కోరుతూ జనగామలో కార్మికులు 'సేవ్ ఆర్టీసీ' నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న మొండి వైఖరితో 48 వేల కుటుంబాలు రోడ్డున్న పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్​ వెనక్కి తీసుకున్నా... విధుల్లోకి తీసుకోవడం లేదని విమర్శించారు. బేషరుతుగా విధుల్లోకి తీసుకోవాని కార్మికులు డిమాండ్​ చేశారు. లేకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

కార్మికుల 'సేవ్​ ఆర్టీసీ' నిరసన ర్యాలీ

ఇదీ చూడండి: సేనకు ఊహించని షాక్​- 'థ్రిల్లర్​'ను తలపించిన రాజకీయం

ABOUT THE AUTHOR

...view details