తెలంగాణ

telangana

By

Published : Feb 11, 2021, 7:06 PM IST

ETV Bharat / state

'ఒక్కటి తక్కువ అని నిరూపించినా పోటీ నుంచి తప్పుకుంటా'

నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం... కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి దిశగా ప్రయాణిస్తోందని తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. గత ఏడున్నర ఏండ్లలో 1.31 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. తాను తెలిపిన ఉద్యోగాల్లో ఒక్కటి తక్కువ భర్తీ చేసినట్లు నిరూపించినా ఎమ్మెల్సీ పోటీ నుంచి తప్పుకుంటానని ఆయన పేర్కొన్నారు.

Trs MLC candidate Palla Rajeshwar Reddy
తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి

తెరాస ఏడున్నర ఏండ్ల పాలనలో 1.31 లక్షల ఉద్యోగాలు భర్తీ అయ్యాయని ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కొందరు కేవలం 35వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయ్యాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను తెలిపిన ఉద్యోగాల్లో ఒక్కటి తక్కువ భర్తీ చేసినట్లు నిరూపించినా ఎమ్మెల్సీ పోటీ నుంచి తప్పుకుంటానని ఆయన పేర్కొన్నారు. జనగామ జిల్లా లింగాల ఘన్​పూర్ మండలంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే రాజయ్యలతో కలిసి పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం... కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి దిశగా ప్రయాణిస్తోందని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులు గత పాలకుల నిర్లక్ష్యంతో నీళ్లు లేక వెలవెల బోతే... తెరాస ప్రభుత్వం చెరువుల్లో పూడికలు తీసి నీళ్లను నింపిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్టాన్ని ప్రథమ స్థానంలో కేసీఆర్‌ నిలిపారని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.

ఇదీ చదవండి:వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోండి.. మేయర్, కార్పొరేటర్లతో సీఎం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details