మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. తనను చూడగానే తెలంగాణ ప్రజలకు దండోరా గుర్తొస్తుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తనను ఉద్యమ బిడ్డగా తీర్చిదిద్దారని తెలిపారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఉపముఖ్యమంత్రిని చేశారని గుర్తు చేశారు. పదవి పోయిన తర్వాత కూడా సీఎం ప్రోత్సహించారని చెప్పారు. 2018 ఎన్నికల్లో తాను గెలవకుండా కొన్నిశక్తులు అడ్డుపడ్డాయని... కేసీఆర్, కేటీఆర్ గెలిపించారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో మాదిగలకు న్యాయం జరుగుతుందని ఆకాంక్షించారు.
"కేసీఆర్ నన్ను ఉద్యమబిడ్డగా తీర్చిదిద్దారు" - trs mla t Rajaiah latest news
ముఖ్యమంత్రి కేసీఆర్ తనను ఉద్యమబిడ్డగా తీర్చిదిద్దారని స్టేషన్‌ఘన్‌పూర్ శాసనసభ్యులు, మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్య తెలిపారు. ఇటీవల మీడియాలో తన పేరుతో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు.
మాజీ ఉపముఖ్యమంత్రి