ప్రయాణికులతో వెళ్తున్న ట్రాలీ వాహనం అదుపు తప్పి బోల్తా పడడం వల్ల ఒకరు మృతి చెందగా, 15మంది గాయపడిన ఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండలం సోలిపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలానికి చెందిన బోయ మల్లయ్య కుటుంబంతో కలిసి సోలిపూర్ గ్రామంలోని నల్ల పోచమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించారు. తిరిగి వెళ్తుండగా గ్రామ శివారులో జరిగిన ప్రమాదంలో కడారి కనకయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే జనగామ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
వాహనం బోల్తా.. ఒకరు మృతి, 15మందికి గాయాలు - trali_boltha_okari_mruthi
వాహనం అదుపుతప్పి బోల్తాపడి ఒకరు మృతి చెందగా, 15మంది గాయపడిన ఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండలం సోలిపూర్ గ్రామశివారులో చోటుచేసుకుంది.

వాహనం బోల్తా.. ఒకరు మృతి
TAGGED:
trali_boltha_okari_mruthi