గ్రామాల్లో తడి, పొడి చెత్తను సేకరించి సేంద్రియ ఎరువుల తయారీకి కృషి చేయాలని డీఆర్డీవో పీడీ గూడూరు రామ్ రెడ్డి సూచించారు. జనగామ జిల్లా చిల్పూరు మండల కేంద్రంలో స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా తడి, పొడి చెత్త నుంచి సేంద్రియ ఎరువుల తయారీపై ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇచ్చారు.
తడి, పొడి చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీపై శిక్షణ - తెలంగాణ వార్తలు
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో తడి, పొడి చెత్త నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. చెత్తనుంచి సేంద్రియ ఎరువుల తయారీపై పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు ఇతర ప్రజాప్రతినిధులకు తరగతులు నిర్వహించారు.
తడి, పొడి చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీపై శిక్షణ
గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను కొనసాగించడం ద్వారా పారిశుద్ధ్య సమస్యలు తొలగిపోతాయని పేర్కొన్నారు. స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని తెలిపారు. ప్రతి గ్రామాన్ని బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి సర్పంచులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని సూచించారు.