రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం నిరంకుశ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని తెజస అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం విజ్ఞప్తి చేశారు. జనగామ జిల్లా తరిగొప్పుల, నర్మెట్ట మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన... పట్టభద్రులను కలిసి ఓటు వేయాలని కోరారు.
నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలి: కోదండరాం - telangana varthalu
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దెబ్బతిందని తెజస అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం విమర్శించారు. జనగామ జిల్లా తరిగొప్పుల, నర్మెట్ట మండలాల్లో ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దెబ్బతిందని, కనీసం సకాలంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారని కోదండరాం విమర్శించారు. పీఆర్సీ అమలు చేయడం లేదని, నిరుద్యోగ భృతి ఊసే లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పాటు, రాజకీయాలపై సమీక్ష జరపాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న నష్టాలను వివరిస్తూ వస్తున్నామని కోదండరాం స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రాజన్నరాజ్యం కాదు.. రామరాజ్యం కావాలి: ఎంపీ అర్వింద్