కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యమకారులను మర్చిపోయి... ఉద్యమ ద్రోహులను పక్కన చేర్చుకొని రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తోందని తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరాం ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. చివరి రోజు ప్రచారంలో భాగంగా జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
'ఉద్యమకారులను మర్చిపోయి... ఉద్యమ ద్రోహులతో కలిసి పాలన' - తెలంగాణ లేటెస్ట్ న్యూస్
రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. జనగామ జిల్లాలోని తరిగొప్పులలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
ఉద్యమకారులను మర్చిపోయి... ఉద్యమ ద్రోహులతో కలిసి పాలన: కోదండరాం
నిరుద్యోగులు, ప్రైవేటు ఉపాధ్యాయులకు సాయం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈనెల 14న జరిగే ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.