తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టర్ కార్యాలయం ముందు యువకుడు ఆత్మహత్యాయత్నం - suicide attempt in front of collector office

కొన్నేళ్లుగా తాము కబ్జాలో ఉన్న భూమిని వేరే వ్యక్తి పేరుపై పట్టాజేశారని ఆరోపిస్తూ కలెక్టర్ కార్యాలయంలో ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

కలెక్టర్ కార్యాలయం ముందు యువకుడు ఆత్మహత్యాయత్నం

By

Published : Nov 11, 2019, 3:34 PM IST

జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. లింగాల ఘనపూర్ మండలం గుమ్మడివెళ్లి గ్రామానికి చెందిన వెంకటేష్ తాము కబ్జాలో ఉన్న భూమిని వేరే వ్యక్తి పేరుపై పట్టజేశారని... ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడంలేదని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడ నిరసన చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులు అతనిని అడ్డుకున్నారు.

కలెక్టర్ కార్యాలయం ముందు యువకుడు ఆత్మహత్యాయత్నం
20 సంవత్సరాల క్రితం కృష్ణయ్య అనే వ్యక్తి నుంచి ఎకరం అసైన్డ్​ భూమిని తన తండ్రి కొనుగోలు చేశాడని తెలిపాడు. ఇప్పుడు అదే వ్యక్తి తన పేరుపై అసైన్డ్ పట్టా తెచ్చుకున్నాడని వాపోయాడు. అధికారుల చుట్టూ తిరిగినా... న్యాయం జరగకపోవడం వల్ల ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిపాడు. కలెక్టర్ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details