తెలంగాణ

telangana

ETV Bharat / state

జనగామలో జగడం.. రెండోరోజూ ఉద్రిక్త పరిస్థితులు

Tensions are high in Jangaon :జనగామ జిల్లాలో తెరాస, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. నర్మెట్ట చౌరస్తాలో భాజపా, తెరాస కార్యకర్తలు పరస్పరం కర్రలతో దాడి చేసుకోగా పలువురి గాయాలయ్యాయి. ఘర్షణలో గాయపడిన పార్టీ శ్రేణులను పరామర్శకు బయలుదేరిన ఈటల రాజేందర్‌, రాజాసింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా తెరాస సర్కార్‌ వ్యవహరిస్తోందని భాజపా నేతలు ధ్వజమెత్తారు.

Tensions are high in Jangaon :
జనగామలో జగడం.. రెండోరోజూ ఉద్రిక్త పరిస్థితులు

By

Published : Feb 10, 2022, 8:13 PM IST

జనగామలో జగడం.. రెండోరోజూ ఉద్రిక్త పరిస్థితులు

Tensions are high in Jangaon : జనగామ జిల్లాలో రెండోరోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం తెరాస కార్యకర్తల దాడికి నిరసనగా.... భాజపా జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలు మౌనదీక్ష చేపట్టారు. జనగామ ప్రధాన కూడలిలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు ర్యాలీగా వెళ్లారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు.... వారిని అడ్డుకుని పార్టీ కార్యాలయానికి తరలించారు. అక్కడే ఉన్న తెరాస కార్యకర్తలు అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడానికి యత్నించగా పోలీసులు వారించారు. భాజపా కార్యాలయంలో చేపట్టిన మౌనదీక్షను భగ్నం చేసి కార్యకర్తలను వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. నర్మెట్ట చౌరస్తాలో భాజపా, తెరాస కార్యకర్తలు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను శాంతిపజేసి... గాయపడినవారిని జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఈటల రాజేందర్​, రాజాసింగ్​ గృహనిర్బంధం

BJP and TRS clash in Jangaon

జనగామలో తెరాస, భాజపా కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన... తమ పార్టీ శ్రేణులను పరామర్శించేందుకు బయలుదేరిన.. ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రాజాసింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరూ జనగామ వెళ్తారనే సమాచారంపై.. బుధవారం రాత్రి నుంచి వారి ఇళ్ల వద్ద మోహరించిన పోలీసులు..... ఇద్దరిని బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ పరిణామంపై మండిపడిన ఈటల రాజేందర్, రాజాసింగ్...ధర్నాలు చేయడానికి ఒక్క తెరాసకు మాత్రమే అనుమతులు ఉంటాయా అని ప్రశ్నించారు. తెరాస వారు దాడులు చేస్తుంటే.... పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని దుయ్యబట్టారు. దెబ్బలు తిన్నవారిపైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం గాయపడిన వారికి ధైర్యం చెప్పే స్వేచ్ఛ కూడా లేదా నిలదీశారు.

ధర్నాలు చేయడానికి ఒక్క తెరాస పార్టీకి మాత్రమే అనుమతులు ఉంటాయా?. తెరాస వారు దాడులు చేయవచ్చు. దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. దెబ్బలు తిన్నవారిమీదనే పోలీసులు కేసులు పెడుతున్నారు. కనీసం గాయపడిన వారికి ధైర్యం చెప్పే స్వేచ్ఛ కూడా లేదా?. టీచర్లు ధర్నా చేస్తే వాళ్లను చితకబాదారు. తెరాస వాళ్లకేమో పోలీసులు బందోబస్తు ఇచ్చారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా ?. ప్రజాసంఘాలు, ఇతర పార్టీలకు మాట్లాడే అధికారం, నిరసన తెలిపే అధికారం లేదా ? తెలంగాణలో పౌర స్వేచ్ఛ లేదు. ఇచ్చిన తెలంగాణ గురించి మోదీ మాట్లాడారు. భాజపా మద్దతుతోనే తెలంగాణ వచ్చింది. మరి వచ్చిన తెలంగాణలో ఏం జరుగుతుంది. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారి మీద వేధింపులు, ఆశ్రిత పక్షపాతం, బంధు ప్రీతి, అధికార దుర్వినియోగం, ధరణి పేరిట లక్షల ఎకరాలు మాయం చేయడం. ప్రజలకిచ్చిన వాగ్దానాలు మర్చిపోవడం, ఉద్యోగులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, పింఛన్లు అందరికీ ఇవ్వకపోవడం, మధ్యాహ్న భోజనం వండే వారికి జీతాలు ఇవ్వకపోవడం, నాలుగేళ్లుగా చిన్న చిన్న బిల్లులు లేవు. ఇవన్నీ చేయాల్సిన మంత్రులు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు.

-ఈటల రాజేందర్​, హుజూరాబాద్​ ఎమ్మెల్యే

భాజపా కార్యకర్తలపై దాడిని ఖండించిన బండి

భాజపా నేతల గృహనిర్బంధాలపై... ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అంబేడ్కర్ ప్రసాదించిన ప్రజాస్వామ్య రాజ్యాంగం కావాలా...? నిర్బంధాల, హౌజ్ అరెస్టులతో కూడిన కల్వకుంట్ల రాజ్యాంగం కావాలో ప్రజలు ఆలోచించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని భాజపా అడ్డుకుని తీరుతుందని.. అందుకోసం ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details