తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెలంగాణ రైతులను ధనవంతుల్ని చేస్తాం' - తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్​ రెడ్డి

దేశంలోనే తెలంగాణ రైతులను ధనవంతులుగా తీర్చిదిద్దుతామని రైసస రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్​రెడ్డి అన్నారు. రెండో సారి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని తెలిపారు.

telangana raithu samanvaya samithi state president palla rajeshwar reddy says that telangana farmers would be country's richest farmers
తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్​ రెడ్డి

By

Published : Dec 22, 2019, 3:24 PM IST

తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్​ రెడ్డి

రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పల్లా రాజేశ్వర్​రెడ్డి తొలిసారి ఉమ్మడి వరంగల్​ జిల్లాలో పర్యటించారు. జనగామ జిల్లా పెంబర్తి కాకతీయ కళాతోరణం వద్ద పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి.

భారీ ర్యాలీతో జిల్లా కేంద్రానికి చేరుకున్న పల్లా... ప్రధాన చౌరస్తాలోని అంబేడ్కర్​ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.
రైతులకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తున్నామని, త్వరలోనే తెలంగాణ రైతులను దేశంలోనే ధనవంతులుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

జనగామ జిల్లాలోని ప్రతి ఎకరానికి నీరు అందించి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'ప్రత్యేక' ఆర్టీసీ ఉద్యోగులకు శిక్షణ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details