జనగామ జిల్లాలో పకడ్బందీగా సహకార సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా అదనపు ఎన్నికల అధికారి మద్దిలేటి అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని తెలిపారు.
సహకార ఎన్నికలకు సిద్ధమైన జనగామ జిల్లా - తెలంగాణలో సహకార సంఘాల ఎన్నికలు
సహకార సంఘాల ఎన్నికలు-2020ను సమర్థంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని జనగామ జిల్లా అదనపు ఎన్నికల అధికారి ఎం.మద్దిలేటి అన్నారు.
![సహకార ఎన్నికలకు సిద్ధమైన జనగామ జిల్లా telangana primary agriculture co operative society elections 2020](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6046009-thumbnail-3x2-a.jpg)
జిల్లా కేంద్రంలోని ఏకశిల బీఎడ్ కళాశాలలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణలో 600 మంది సిబ్బంది పాల్గొన్నారు.
జనగామ జిల్లాలో 14 సహకార సంఘాల్లో మొత్తం 182 వార్డులకు 605 నామినేషన్లు రాగా, 274 ఉపసంహరించుకున్నారని మద్దిలేటి వెల్లడించారు. 66 డైరెక్టర్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని, 166 వార్డుల్లో 329 మంది బరిలో ఉన్నారని తెలిపారు. కళ్లెం, పాలకుర్తిలో 26 వార్డులు ఏకగ్రీవం కాగా.. దేవరుప్పుల, వెలమనేని తొర్రూరులో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు.