తెలంగాణ

telangana

సీఎం కేసీఆర్​ అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు : ఎర్రబెల్లి

రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు ప్రారంభానికి ముస్తాబయ్యాయి. శనివారం మధ్యాహ్నం 12.30కు సీఎం కేసీఆర్ జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించనున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. సభకు 5వేల మంది రైతులను మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు.

By

Published : Oct 31, 2020, 11:45 AM IST

Published : Oct 31, 2020, 11:45 AM IST

Telangana Panchayati Raj Minister Errabelli Dayakar Rao About Raithu Vedikalu The beginning
సీఎం కేసీఆర్..​ దేశానికే ఆదర్శం: ఎర్రబెల్లి

రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు ప్రారంభానికి ముస్తాబయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,601 రైతు వేదికలు మంజూరు కాగా, ఇప్పటి వరకు 1,580 వేదికల నిర్మాణం పూర్తయినట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. పంటల సాగులో మెళకువలపై శిక్షణ ఇచ్చేందుకు, వారంతా ఒక చోట సమావేశమై తమ సమస్యలు, ఇబ్బందులను చర్చించేందుకు రైతు వేదికలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.

రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశంలో మరే రాష్ట్రం అమలు చేయడం లేదన్నారు. మన రాష్ట్రంలో మాత్రమే రైతు బంధు సమితులు ఉన్నాయని చెప్పారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్​గా విభజించి, ప్రతి క్లస్టర్​లో రూ.22 లక్షల ఖర్చుతో రైతు వేదిక నిర్మిస్తున్నామని తెలిపారు. తన నియోజకవర్గం పరిధిలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తొలి రైతు వేదిక ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు.

కేసీఆర్​ అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు : ఎర్రబెల్లి

ఇవీచూడండి:రైతు వేదికల నిర్మాణంతో కొత్తశకం... నేడు ప్రారంభించనున్న సీఎం

ABOUT THE AUTHOR

...view details