HRC Suo moto Case: బతికుండగానే రికార్డుల్లో చంపేసిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జనగామ జిల్లా లింగాల ఘనపురానికి చెందిన వృద్ధురాలు నాగిడి అంజమ్మకి కొంతమంది సిబ్బంది చేసిన ఈ పొరపాటు ఫలితంగా పింఛన్ రాకుండా ఆగిపోయింది. పింఛన్ కోసం 13 నెలలుగా అధికారుల చుట్టూ తిరిగి వేడుకున్నా పట్టించుకునే వారు లేక దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్లదీస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2014లో ఆమెకు వితంతు పింఛన్‌ను మంజూరు చేసింది. 2020 డిసెంబరులో అకస్మాత్తుగా పింఛన్ ఆగిపోయింది. దీంతో ఆమె అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎలాంటి ఫలితం లేకపోయింది. చివరికి ఇటీవల గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్‌కు తన సమస్యను మొరపెట్టుకుంది.
HRC Suo moto Case: బతికుండగానే రికార్డుల్లో చంపేశారు.. - tshrc
HRC Suo moto Case: కొంతమంది సిబ్బంది చేసిన పొరపాటు కారణంగా ఓ వృద్ధురాలికి పింఛన్ రాకుండా ఆగిపోయింది. పింఛన్ కోసం 13 నెలలుగా అధికారుల చుట్టూ తిరిగి వేడుకున్నా పట్టించుకునే వారు లేక దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్లదీస్తోంది. పింఛన్ ఆగిపోవడానికి కారణాలు రికార్డుల్లో తాను చనిపోయినట్లు ఉందని పై అధికారులు గుర్తించారు. ఈ విషయంపై పలు దినపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది.
దీంతో తనిఖీ చేయగా అంజమ్మ పింఛన్ ఆగిపోవడానికి కారణాలు రికార్డుల్లో తాను చనిపోయినట్లు ఉందని పై అధికారులు గుర్తించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే తప్పు తమది కాదని మండల పరిషత్ కార్యాలయం అధికారులు, డీఆర్డీవో పింఛన్ విభాగం అధికారులు తప్పించుకుంటున్నారు. ఈ విషయంపై పలు దినపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. వెంటనే ఆ వృద్ధురాలికి తిరిగి పింఛన్ మంజూరు చేసి... ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకొని మార్చి 23వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్చించాలని జనగామ జిల్లా కలెక్టర్‌కి హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: