రాష్ట్రంలో కరోనా వైరస్ దరిచేరకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. జనగామ పట్టణంలోని పలు ప్రాంతాల్లో నూతనంగా చేపట్టనున్న సులభ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.
సులభ్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీకారం - ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
జనగామ పట్టణంలోని పలు ప్రాంతాల్లో సులభ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి శ్రీకారం చుట్టారు. పల్లెప్రగతితో గ్రామాలు, పట్టణ ప్రగతితో పట్టణాలన్నీ పరిశుభ్రంగా మారుతున్నాయని.. కావున ఎలాంటి వైరస్లు ప్రజలను దరిచేరవని ఆయన అన్నారు.

సులభ్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీకారం
పల్లె ప్రగతితో గ్రామాలు, పట్టణ ప్రగతితో పట్టణాలన్నీ పారిశుద్ధ్యం మెరుగైనందున ఎలాంటి వైరస్లు, అంటువ్యాధులు రావని ప్రజలకు అభయమిచ్చారు. అయినప్పటికీ ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ఆయన సూచించారు. కరోనా వైరస్‌పై సామాజిక మాధ్యమాల్లో ప్రజలను బెదరగొట్టే పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సులభ్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీకారం