పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని జనగామలో విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కళా బృందం, విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పారిశుద్ధ్యంపై పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. జనగామ జిల్లాను ముందు వరుసలో నిలపాలని కలెక్టర్ నిఖిల కోరారు. వివిధ వార్డుల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో మొక్కలు నాటారు.
పట్టణ ప్రగతిపై విద్యార్థుల ప్లాష్ మాబ్ - జనగామలో పట్టణ ప్రగతి కార్యక్రమం
పట్టణ ప్రగతి సందర్భంగా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలంటూ జనగామలో విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు.
పట్టణ ప్రగతిపై విద్యార్థుల ప్లాష్ మాబ్