నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను వెంటనే నిలిపేసి పర్యావరణాన్ని రక్షించాలని తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరాం డిమాండ్ చేశారు. జనగామలో తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్వహించనున్న 'నల్లమలను రక్షించుకుందాం' నిరసన కార్యక్రమ గోడపత్రికను కోదండరాం ఆవిష్కరించారు. యురేనియం తవ్వకాల వల్ల రేడియోధార్మిక కిరణాలు వెలువడి పర్యావరణం కలుషితం కావటంతో పాటు ప్రజలు కాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడుతారని వివరించారు. తక్షణమే యురేనియం తవ్వకాలను నిలిపేసి పర్యావరణాన్ని కాపాడాలని కోదండరాం డిమాండ్ చేశారు.
యురేనియం తవ్వకాలను తక్షణమే నిలిపేయండి... - tjs
నల్లమల అటవీ ప్రాంతంలో జరుపుతున్న తవ్వకాల వల్ల పర్యావరణానికే కాకుండా ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లనుందని తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరాం తెలిపారు. జనగామలో తలపెట్టనున్న నల్లమలను రక్షించుకుందాం కార్యక్రమ గోడపత్రికను ఆవిష్కరించారు.
యురేనియం తవ్వకాలను తక్షణమే నిలిపేయండి...