ఆడపడుచులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ అద్భుత పథకమైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ను ప్రవేశపెట్టారని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో అర్హులైన 20 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. మహిళలు ఆత్మగౌరవంతో జీవించేందుకు కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కొనియాడారు.
'మహిళలు ఆత్మగౌరవంతో జీవించేలా కేసీఆర్ పాలన' - jangaon district news
కరోనా రెండో దశ విజృంభిస్తున్న కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో కొవిడ్ టీకాలు అందుబాటులో ఉన్నాయని... ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవాలని సూచించారు. జనగామ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో అర్హులైన 20 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.
కల్యాణలక్ష్మి చెక్కులను అందజేసిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే
వేలేరు, ధర్మసాగర్ మండలాల్లో ఎమ్మెల్యే పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. కేశవ నగర్లో పల్లె పకృతి వనాన్ని ప్రారంభించారు. గత సంవత్సర కాలంగా కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తోందని అన్నారు.
ఇదీ చదవండి:ధోనీ సలహాల వల్లే నటరాజన్ ఇలా!