జనగామ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో శాసనమండలి ప్రభుత్వ ఛీప్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో తెలంగాణది అగ్రస్థానం - State formation day celebrations in janagama
కరోనా విజృంభిస్తున్న వేళ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నాయకులు నిరాడంబరంగా నిర్వహించారు. జనగామలో కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరులకు నివాళులర్పించారు.

State formation day celebrations in janagama
అంతకుముందు అమరవీరుల స్థూపానికి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కరోనా నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవాలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెంకటేశ్వర్లు కొనియాడారు.
TAGGED:
Telangana formation day