పార్టీకి నష్టం కలిగినా ప్రజల కష్టాలకు చలించిపోయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారని టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్మ సంతోశ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి జన్మదినం సందర్భంగా జనగామ జిల్లా తరిగొప్పుల మండలకేంద్రంలో కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు.
'ప్రజల కష్టాలను తీర్చాలనే రాష్ట్రం ఇచ్చింది ' - జనగామ జిల్లా తాజా సమాచారం
తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చాలనే ఉద్దేశ్యంతో సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్మ సంతోశ్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధినేత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా తరిగొప్పుల మండలకేంద్రంలో కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు.
'ప్రజల కష్టాలను తీర్చాలనే రాష్ట్రం ఇచ్చింది '
ఈ కార్యక్రమానికి సంతోశ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని ఆశించిన ప్రజలకు తెరాస ప్రభుత్వం మొండిచేయి చూపిందని ఆయన విమర్శించారు.