విశాఖ 4వ పాదం; అనురాధ, జ్యేష్ఠ
ఆదాయం 8; వ్యయం 14; రాజపూజ్యం 4; అవమానం 5
విశాఖ 4వ పాదం; అనురాధ, జ్యేష్ఠ
ఆదాయం 8; వ్యయం 14; రాజపూజ్యం 4; అవమానం 5
ఈ రాశివారికి ఈ ఏడాది అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. ధర్మబుద్ధితో, పట్టుదలతో చేసే పనులు శీఘ్రఫలితాన్నిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఆశించిన ధనలాభముంటుంది. ఓర్పు సహనంతో వ్యవహరిస్తే మంచి భవిష్యత్తు పొందుతారు. ఆత్మీయుల సలహాలూ సూచనలూ పనిచేస్తాయి. క్రియాశీలంగా ఆలోచించండి.
పట్టింపులకు పోకుండా పనులు పూర్తయ్యే విధం చూసుకోవాలి. లక్ష్యం చేరువలోనే ఉంది. విద్యార్థులు కష్టపడితేనే ఫలితం ఉంటుంది. నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. ఆర్థిక ఇబ్బందులు రాకుండా తగిన ప్రణాళికలు వేసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. గురు రాహు కేతు శ్లోకాలు చదువుకోవాలి. మనోబలం పెరుగుతుంది.
ఇదీ చూడండి:ప్లవనామ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉందంటే!