ముఖ్యమంత్రి కేసీఆర్ ఎండాకాలంలో కూడా గోదావరి జలాలను తీసుకుని వచ్చి చెరువులను, కుంటలను నింపుతున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. జనగామ జిల్లా ఎర్రగొల్ల పహాడ్ గ్రామ సర్పంచ్ రేణుక, తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను పంచాయతీకి అందించారు. దీనితో పాటు గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ఎమ్మెల్యే సమక్షంలో తెరాసలో చేరిన సర్పంచ్
జనగామ జిల్లా ఎర్రగొల్ల పహాడ్ గ్రామ సర్పంచ్ రేణుక, తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ ఎండాకాలంలో కూడా జనగామ జిల్లాలో చెరువులను నింపుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.
Joinings in trs
అనంతరం కాల్వ పనులు జరగడం లేదని గ్రామస్థులు ఎమ్మెల్యేకు తెలపడం వల్ల వెంటనే సంబంధింత అధికారితో ఫోన్లో మాట్లాడి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో నియోజకవర్గంలోని చెరువులను నింపుకున్నామని, ఎండాకాలంలో కూడా గోదావరి నుంచి జలాలను తీసుకుని వస్తున్నామని వెల్లడించారు. లాక్ డౌన్ నేపథ్యంలో రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చెయ్యాలని 30వేల కోట్ల నిధులను మంజూరు చేసి రైతులను ఆదుకుంటున్నారని తెలిపారు.