తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామీణ క్రీడలకు మంచి రోజులొచ్చాయి: డీసీపీ శ్రీనివాస్​రెడ్డి - latest news on jangaon dcp srinivas reddy

గ్రామీణ క్రీడలకు ఇప్పుడు మంచి రోజులొచ్చాయని డీసీపీ శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. ఎర్రగొల్లపహాడ్​లో జరిగిన జిల్లా స్థాయి గ్రామీణ కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Rural Games have good days: DCP Srinivas Reddy
గ్రామీణ క్రీడలకు మంచి రోజులొచ్చాయి: డీసీపీ శ్రీనివాస్​రెడ్డి

By

Published : Jan 10, 2020, 12:11 PM IST

విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని డీసీపీ శ్రీనివాస్​ రెడ్డి పేర్కొన్నారు. జనగామ జిల్లా ఎర్రగొల్లపహాడ్​లో రెండు రోజుల పాటు సాగిన జిల్లా స్థాయి గ్రామీణ కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమానికి ఏసీపీ వినోద్​కుమార్​తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫైనల్ పోటీలను ప్రారంభించి, ఉత్సాహంగా తిలకించారు. అనంతరం విజేతగా నిలిచిన జనగామ స్టేడియం టీంకు బహుమతులను ప్రదానం చేశారు.

గ్రామీణ క్రీడలకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని.. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని డీసీపీ సూచించారు. జిల్లా స్థాయిలోనే కాకుండా, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి జనగామ క్రీడాకారులు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

గ్రామీణ క్రీడలకు మంచి రోజులొచ్చాయి: డీసీపీ శ్రీనివాస్​రెడ్డి

ఇదీ చూడండి : మిస్సింగ్ కేసును ఛేదించిన తెలంగాణ పోలీస్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details