తమను విధుల్లోకి తీసుకోవాలంటూ జనగామ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. రాజ్యాంగబద్ధంగా సమ్మె చేస్తే విధుల నుంచి తొలగించడం సరైన పద్ధతి కాదని... కేసీఆర్ మనసు మార్చుకోవాలని వేడుకున్నారు. 54రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బేషరతుగా విధుల్లో చేరుతామని చెప్పినా.. చేర్చుకోవడం లేదని, జీతాలు లేక పిల్లలు చదువులకు, కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.
'ఆర్టీసీ కార్మికులందర్నీ చంపి.. తెలంగాణ ఏలుకో' - Rtc workers protest janagama
54 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కేసీఆర్ గారు మా ఆర్టీసీ కార్మికులందరినీ చంపి మీరు రాజ్యాన్ని ఏలుకోండి. ------ జనగామ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికురాలి ఆవేదన

జనగామ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన
జనగామ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన
ఇదీ చూడండి: జేబీఎస్ వద్ద రెండో రోజూ కార్మికుల అరెస్ట్