తమ డిమాండ్లను పరిష్కరించాలని జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్మికులు 37రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం చర్చలు జరపకుండా మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్ట్ మొట్టికాయలు వేసినా.. సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పడం ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడకు నిదర్శనమన్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని.. లేని పక్షంలో ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు చేసినా.. మిలియన్ మార్చ్ విజయవంతమైందన్నారు.
'నియంతృత్వ పోకడకు నిదర్శనం' - rtc protest in janagama
ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు జనగామ జిల్లా కేంద్రంలోని కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
జనగామలో ఆర్టీసీ ధర్నా